గో బ్యాక్ గో బ్యాక్... వైసిపి రెబల్ ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా ఆందోళనలు
విజయవాడ : స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన నరేంద్ర మోదీ ఇవాళ (సోమవారం) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు.
విజయవాడ : స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన నరేంద్ర మోదీ ఇవాళ (సోమవారం) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలాకాలం తర్వాత స్వరాష్ట్రానికి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆయన రాకను నిరసిస్తూ విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు విజయవాడ రైల్వే స్టేషన్ లో రఘురామ కృష్ణంరాజు గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఇక హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నరసాపూర్ ఎక్స్ ప్రెస్ లో రఘురామ కృష్ణంరాజు తన అనుచరులతో కలిసి ఆదివారం రాత్రి భీమవరం బయలుదేరారు. కానీ పోలీసులు వారిని అనుసరిస్తున్నారని అనుమానిస్తూ బేగంపేట రైల్వే స్టేషన్ లో దిగిపోయారు. తన ఏపీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎంపీ రఘురామ ప్రకటించారు.