ఆదివారం పూట ప్రత్యేక క్లాసులు... తరగతులు అడ్డుకున్న ఎన్ఎస్ యూఐ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించినా ఆదివారం పూట ప్రత్యేక క్లాసుల పేరిట నిర్వహిస్తున్న తరగతులను ఎన్ఎస్ యూఐ నాయకులు అడ్డుకున్నారు. 

First Published Sep 25, 2022, 8:54 PM IST | Last Updated Sep 25, 2022, 8:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించినా ఆదివారం పూట ప్రత్యేక క్లాసుల పేరిట నిర్వహిస్తున్న తరగతులను ఎన్ఎస్ యూఐ నాయకులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఆదివారం ఉదయం ఆరుగంటల నుండే విజయవాడ ప్రకాష్ నగర్ లోని గాయత్రి స్కూల్ యాజమాన్యం క్లాసులు నిర్వహిస్తోందని న్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆరోపించారు. ఇలా విద్యార్థులను ఇబ్బందిపెడుతూ నిబంధనలు పాటించకుండా క్లాసులు నిర్వహించడమేంటని ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై స్కూల్ యాజమాన్యం దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి స్కూల్ గుర్తింపును రద్దు చేయడమే కాదు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేసారు. లేదంటే స్కూల్ ముందే కాదు విద్యాశాఖ కార్యాలయం ముందు ఎన్ఎస్ యూఐ ఆందోళనలు చేపడుతుందని శ్రీనివాస్ హెచ్చరించారు.