video news : ఏమయ్యాడు..ఎటుపోయాడు...రోజులు గడుస్తున్నా జాడలేడు...
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో మిస్సింగ్ మిస్టరీ. రాజబాబు అనే పురోహితుడు పదిరోజుల క్రితం ఇంటి నుండి బయటకి వెళ్లి కనబడకుండా పోయాడు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో మిస్సింగ్ మిస్టరీ. రాజబాబు అనే పురోహితుడు పదిరోజుల క్రితం ఇంటి నుండి బయటకి వెళ్లి కనబడకుండా పోయాడు. ఈనెల 5 వ తేదీ సాయంత్రం భార్యకు ఫోన్ చేసిన పదినిమిషాల్లో రాజబాబు మొబైల్ స్విచ్చాఫ్ అయింది. రాజబాబు అర్చకత్వంతో పాటు స్దానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు.ఒంటి మీద బంగారం, ద్విచక్రవాహనంలో డబ్బు ఉందని రాజబాబు భార్య చెబుతోంది. మిస్సింగ్ అయి పదిరోజులు దాటుతున్నా రాజబాబు ఆచూకి లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి వెతుకుతున్నారు.