Presidential Polls 2022 : ఎమ్మెల్యేలతో కలిసే అసెంబ్లీకి... ఓటేసిన చంద్రబాబు
భారత నూతన రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో నేడు పోలింగ్ కొనసాగుతోంది.
భారత నూతన రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఇలా ఏపీ అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఓటుహక్కును వినియోగించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుండి అసెంబ్లీకి చేరుకుని మొదట చంద్రబాబు ఓటేసారు. అనంతరం ఎమ్మెల్యేలు ఓటుహక్కును వినియోగించుకున్నారు.