Presidential Polls 2022 : రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు సీఎం జగన్ దే...
అమరావతి : భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అమరావతి : భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ఓటు వేసారు. అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్ కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలందరూ తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.