వాడు చదువుకున్నోడా లేక చదువులేని మూర్ఖుడా..: సీఎస్ పై సిపిఐ నారాయణ ధ్వజం
అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేలా వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వుందని సిపిఐ నాయకులు నారాయణ మండిపడ్డారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేలా వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వుందని సిపిఐ నాయకులు నారాయణ మండిపడ్డారు. ఉద్యోగులు కొత్తగా ఏమీ అడగట్లేదు... తమకు రావాల్సినవే అడుగుతుంటే ఈ నిరంకుశ ప్రభుత్వం అక్షరాస్యులు, టీచర్లు, మేధావులపై దాడి చేస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ మాట్లాడుతున్నాడని... వాడు చదువుకున్నోడా లేక చదువులేని మూర్ఖుడా అని సిపిఐ నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.