Asianet News TeluguAsianet News Telugu

బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం.. ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట : విను కొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మ నాయుడు దేవాలయం లాంటి అసెంబ్లీని వేదికగా చేసుకొని తనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

First Published Sep 17, 2022, 12:52 PM IST | Last Updated Sep 17, 2022, 12:52 PM IST

చిలకలూరిపేట : విను కొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మ నాయుడు దేవాలయం లాంటి అసెంబ్లీని వేదికగా చేసుకొని తనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం ఆయన నివాసంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో "బి" టాక్స్ పేరుతోటి విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ టెక్స్టైల్ పార్క్ కి నేను డబ్బులు అడిగానని, తిరుమల డైరీ ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్బంది పెట్టారని చెప్పుతున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంలో కారుచౌకగా భూములు కొని సబ్సిడీ పొంది, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్స్టైల్ పార్కు అమ్మమని నా దగ్గరకు వచ్చి నాపై చంద్రబాబుపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నాలుగైదు పార్టీలు మారిన బొల్లా బ్రహ్మనాయుడు నిబద్ధత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉన్నాయని, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం మాట్లాడుతున్నారని, నిబద్ధత లేని నాయకుడని అన్నారు.