నువ్వు నిజంగా మహాతల్లివమ్మా... చేతులెత్తి దండం పెట్టిన పోలీసులు...
ఆమె జీతం నెలకు మూడున్నరవేలు.. కానీ ఆమె మనసు కోటి రూపాయలవిలువైంది. అందుకే లాక్ డౌన్ సమయంలో మనకోసం ఎండనకా, వాననకా పనిచేస్తున్న పోలీసుల కోసం రెండు పెద్ద బాటిల్స్ కూల్ డ్రింక్ కొనుక్కొచ్చి ఇవ్వబోయింది. ఆమె పెద్దమనసుకు పోలీసులు ఫిదా అయ్యారు. ఆమె అందరికీ ఆదర్శం అంటూ పొగిడారు. తమకోసం ఇళ్ళల్లో ఉంటే చాలు.. అంటూ తమ దగ్గరున్న బాటిల్స్ కూడా ఆమెకే ఇచ్చి ఇంటిదగ్గర పిల్లలకు ఇవ్వమని పంపించారు. కల్మషంలేని నవ్వుతో అందర్నీ ఆకట్టుకున్న ఈ మహిళ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది..