video news : రాయదుర్గంలో టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అరెస్టుకు ప్రయత్నం, పరిస్థితి ఉద్రిక్తం
అనంతపురం, రాయదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డి.హిరేహాల్ మండలం కళ్యం గ్రామంలో రెండు రోజుల క్రితం టిడిపి జెండా ఫోల్ కు వున్న జెండా తొలగించి ఫోల్ కు వైసిపి రంగులేసిన ఘటన నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం టిడిపి కార్యాలయం నుంచి కళ్యం గ్రామానికి బయల్దేరిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, డి. హీరేహాల్ మండల టిడిపి నాయకులను చదం రైల్వే గేటు వద్ద భారీ గా మోహరించిన పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.