Asianet News TeluguAsianet News Telugu

పట్టుబడ్డ భారీ గంజాయి... పోలీసులను చూసి కారువదిలి పరారైన స్మగ్లర్లు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో  భారీగా గంజాయి పట్టుబడింది. 

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో  భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని కారులో తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టిన పోలీసులు   దాచేపల్లి సరిహద్దు కారును పట్టుకున్నారు. కృష్ణా నది బ్రిడ్జిపై వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారును వదిలిపెట్టి స్మగ్లర్లు పరారయ్యారు. దీంతో కారుతో పాటు అందులోని గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.