తూ.గో జిల్లా: బస్సులో భారీ సొత్తు... పట్టుబడిన రూ.5కోట్ల నగదు, పది కిలోల బంగారం

కిర్లంపూడి: విజయనగరం నుంచి గుంటూరు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కోట్ల నగదు, కిలోల బంగారాన్ని ఏపీ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజేర్ల మండలం విరపల్లి టోల్ గేట్ వద్ద ప్రైవేట్ బస్సులో తనిఖీలు చేపట్టిన పోలీసులకు 5 కోట్ల 6 లక్షల రూపాయల నగదు, పది కేజీల బంగారం దొరికింది. ఈ సొత్తుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి భారీ మొత్తంలో సొత్తును పట్టుకున్న జగ్గంపేట సిఐ సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతిరావు డిఎస్పి అరిటాకుల శ్రీనివాసరావు అభినందించారు.
 
First Published Apr 1, 2022, 5:19 PM IST | Last Updated Apr 1, 2022, 5:19 PM IST