Asianet News TeluguAsianet News Telugu

కంచికచర్లలో పోలీసుల తనిఖీలు...బస్సులో భారీగా పట్టుబడ్డ నగదు

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. 

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. గరుడ బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షల రూపాయల నగదును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ డబ్బు వైజాగ్ నుండి హైదరాబాద్ తీసుకు వెళ్తున్నట్లు గుర్తించారు.