దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు... ఆ రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు: విజయవాడ సిపి

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు.

First Published Sep 26, 2022, 3:20 PM IST | Last Updated Sep 26, 2022, 3:20 PM IST

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసామన్నారు. మూలా నక్షత్రం, విజయదశమి రోజున ఎక్కువగా భక్తలు అమ్మవారి దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రెండ్రోజులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని సిపి తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీస్ శాఖ కూడా ఇంద్రకీలాద్రిపై కట్టదిట్టమైన భద్రత ఏర్పాటుచేసినట్లు సిపి వెల్లడించారు.  400 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ప్రతి చోటును క్షుణ్ణంగా పరిశీలించే ఏర్పాట్లు చేసామన్నారు. ఘాట్ల  వద్ద సెక్యూరిటీ పెంచామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా హెల్ప్ డెస్క్ నంబర్లకు 112, 100 ఫోన్ చేయాలని సిపి క్రాంతి రాణా టాటా సూచించారు.