యూరియాతో నాటుసారా తయారీ.. దాడి చేసిన పోలీసులు...
జయనగరం జిల్లా, కన్నయ్య గూడ సమీపంలో నాటుసారా స్థావరాలపై ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, టాస్క్ ఫోర్స్ సి ఐ చంద్రమౌళి దాడి చేశారు.
జయనగరం జిల్లా, కన్నయ్య గూడ సమీపంలో నాటుసారా స్థావరాలపై ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, టాస్క్ ఫోర్స్ సి ఐ చంద్రమౌళి దాడి చేశారు. ఈ దాడిలో 2200 లీటర్ల బెల్లపు ఊట, నాటుసారా తయారీకి ఉపయోగించే, వంట సామాగ్రి, నల్ల బెల్లం యూరియా, పెద్ద ఎత్తున దొరికాయి. ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశామని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వీటి విలువ సుమారు 60 వేల రూపాయలు ఉంటుందని అన్నారు.