కర్నూల్ జిల్లాలో అమానవీయం... ఇద్దరమ్మాయిలతో చున్నీలతో బంధించిన పోలీసులు
కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం గుడిపాడులో తమ ఇంటిముందున్న ఖాళీ స్థలాన్ని ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని మీనాక్షమ్మ అనే మహిళతో పాటు ఆమె కుమార్తెలు అడ్డుకున్నారు. తోటి ఆడవాళ్లని కూడా చూడకుండా పక్కకు లాగేసిన మహిళా పోలీసులు చేతులను చున్నీలతో కట్టేసారు. తమను, తమ స్థలాన్ని విడిచిపెట్టాలని వేడుకున్నా వినిపించేకోలేదు. ఇలా తల్లీకూతుళ్లపై పోలీసుల అమానవీయంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ అమానుష ఘటనపై సీరియస్ అయ్యారు.