దెందులూరులో ఉద్రిక్తత... వైసిపి, టిడిపి వర్గాల రాళ్ళదాడిలో పోలీసులకు గాయాలు
ఏలూరు: సోషల్ మీడియా పోస్ట్ కారణంగా వైసిపి, టిడిపి వర్గాలు ఘర్షణకు దిగిన ఘటన ఏలూరు జిల్లా దెందులూరులో చోటుచేసుకుంది.
ఏలూరు: సోషల్ మీడియా పోస్ట్ కారణంగా వైసిపి, టిడిపి వర్గాలు ఘర్షణకు దిగిన ఘటన ఏలూరు జిల్లా దెందులూరులో చోటుచేసుకుంది. వైసిపి నాయకులపై సోషల్ మీడియాలో టిడిపి వర్గం అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టడంతో ఇరు వర్గాలమధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. విషయం తెలిసి స్థానిక పోలీసులు ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందుగానే ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ వద్దే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో దెందులూరు ఎస్సై, కానిస్టేబుల్ తో పాటు ఇరు వర్గాలకు చెందినవారూ గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.