ఏలూరులో దారుణం... చెత్తపన్ను రూ.100 కట్టనందుకు మహిళపై పోలీస్ కేసు
ఏలూరు: చెత్తపన్ను కట్టలేదని ఓ మహిళపై అధికారులు పోలీసులకు పిర్యాదు చేసిన ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది.
ఏలూరు: చెత్తపన్ను కట్టలేదని ఓ మహిళపై అధికారులు పోలీసులకు పిర్యాదు చేసిన ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. ఏలూరు పట్టణానికి చెందిన కొమరి లక్ష్మి చెత్తపన్ను కట్టకపోవడంతో సచివాలయ ఉద్యోగి ప్రత్యూష పోలీస్ కేసు పెట్టింది. చెత్తకు 100రూపాయలు కట్టాలా అని ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని బాధిత మహిళ తెలిపింది. ఇంతవరకు జీవితంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళలేదని... ఇప్పుడు చెత్తపన్ను కట్టనందుకు వెళ్లాల్సి వస్తోందని లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.