Asianet News TeluguAsianet News Telugu

గుడివాడకు వెళుతున్న కొల్లు రవీంద్ర అరెస్ట్... పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదం

గుడివాడ : ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గుడివాడ భారీగా పోలీసులు మొహరించారు. 

First Published Dec 26, 2022, 4:40 PM IST | Last Updated Dec 26, 2022, 4:40 PM IST

గుడివాడ : ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గుడివాడ భారీగా పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో టిడిపి నిర్వహిస్తున్న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం కోసం గుడివాడకు పయనమైన మాజీ మంత్రి, టిడిపి నేత కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. మార్గమధ్యలో రవీంద్రను అడ్డుకున్న పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని తిరిగి ఇంటికి తరలించారు.  
 
ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ... గుడివాడకు వెళ్ళడానికి ప్రభుత్వ అనుమతి ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుడు రావి వెంకటేశ్వర రావును కలిసేందుకు కూడా పోలీస్ అనుమతి తీసుకోవాలా? రంగా గారి వర్ధంతి లో పాల్గొనేందుకు కూడా నాకు స్వాతంత్య్రం లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు ఎందుకు ఉదయం నుండి నన్ను వెంబడిస్తున్నారు... అడుగడుగునా ఈ ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని అడిగారు.  తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రభుత్వం కుట్రచేస్తోందని కొల్లు రవీంద్ర ఆందోళన వ్యక్తం చేసారు.