Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిదో తరగతి బాలుడి అక్రమ అరెస్ట్ ... మాచవరం పోలీసుల ఓవరాక్షన్...

పల్నాడు : తండ్రి తప్పు చేసాడని అభం శుభం తెలియని మైనర్ బాలున్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన ఘటన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సంచలనంగా మారింది. 

First Published Nov 4, 2022, 10:44 AM IST | Last Updated Nov 4, 2022, 10:44 AM IST

పల్నాడు : తండ్రి తప్పు చేసాడని అభం శుభం తెలియని మైనర్ బాలున్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన ఘటన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని తురకపాలెం గ్రామ సర్పంచ్ తనపై కొందరు టిడిపి వర్గీయులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టిడిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు తండ్రి దొరకలేదని 9వ తరగతి చదువుతున్న అతడి మైనర్ కొడుకును పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతేకాదు మిగతావారితో కలిపి ఓ నిందితుడిలా పోలీస్ స్టేషన్లో నేలపై కూర్చుబెట్టారు. బాలుడి మనసును గాయపర్చేలా వ్యవహరించిన మాచవరం పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు.