Asianet News TeluguAsianet News Telugu

వీడియో : వృత్తి క్యాబ్ డ్రైవర్...ప్రవృత్తి దొంగతనం...

విశాఖ, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పోలీసులు  అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

విశాఖ, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పోలీసులు  అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ పిసిఎల్ పార్కింగ్ ప్రదేశం నుండి ద్విచక్ర వాహనాలు తస్కరిస్తున్న పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ చేసిన వాహనాలు మాయం అవుతున్నాయన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్ పిసిఎల్ కర్మాగారంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న దర్మాల శ్రీను దొంగగా తేల్చారు.