తాడేపల్లిలో ముగ్గురు చిల్లరదొంగల అరెస్ట్... 18 మొబైల్స్ స్వాధీనం

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సెల్ ఫోన్ దొంగతనాలను పాల్పడుతున్న ముగ్గురు యువకులను తాడేపల్లి పోలీసులు పట్టుకున్నారు. 

First Published Jun 3, 2022, 3:28 PM IST | Last Updated Jun 3, 2022, 3:28 PM IST

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సెల్ ఫోన్ దొంగతనాలను పాల్పడుతున్న ముగ్గురు యువకులను తాడేపల్లి పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అనుమానించిన పోలీసులు అరెస్ట్ చేసారు. వీరినుండి ఏకంగా 18 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్దగల కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గరినీ రిమాండ్ కు తరలించారు.