Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ బహిరంగ సభ... జనసంద్రంగా మారిన విశాఖ రోడ్లు

విశాఖపట్నం : ప్రధాన నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పాల్గొనే బహిరంగసభకు వైసిపి ప్రభుత్వం, బిజెపి భారీ జనసమీకరణ చేపట్టింది. 

First Published Nov 12, 2022, 10:41 AM IST | Last Updated Nov 12, 2022, 10:41 AM IST

విశాఖపట్నం : ప్రధాన నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పాల్గొనే బహిరంగసభకు వైసిపి ప్రభుత్వం, బిజెపి భారీ జనసమీకరణ చేపట్టింది. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఇప్పటికే బహిరంగసభ ఏర్పాట్లు పూర్తయ్యింది. ఇక ఇప్పటికే ప్రత్యేక బస్సులు, రైళ్లు, వివిధ వాహనాల్లో భారీగా ప్రజలు విశాఖకు చేరుకుంటున్నారు. సుమారు 3లక్షల మంది ప్రధాని సభకు హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలతో విశాఖ రోడ్లు జనసంద్రంగా మారాయి.  ఇక ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన... భారీ బహిరంగ సభ నేపథ్యంలో విశాఖలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసారు పోలీసులు. స్వయంగా రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి బహిరంగ సభ ప్రాంతాన్ని సందర్శించారు. ఇవాళ విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని సభకు హాజరయ్యే వాహనాలకోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. ఇక సభకు హాజరయ్యే ప్రజల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని సిద్దంచేసారు.