అల్లూరి జయంతి వేడుకలో ఆసక్తికర సంఘటన... మన్యంవీరున్ని కీర్తిస్తూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం

అమరావతి : తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజుని కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు మాట్లాడటం ఇరు తెలుగురాష్ట్రాల ప్రజలకు పులకిపజేస్తోంది.

First Published Jul 4, 2022, 3:54 PM IST | Last Updated Jul 4, 2022, 3:54 PM IST

అమరావతి : తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజుని కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు మాట్లాడటం ఇరు తెలుగురాష్ట్రాల ప్రజలకు పులకిపజేస్తోంది. అల్లూరి 125వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రధాని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ''మన్యంవీరుడు, తెలుగుజాతి పురుషుడు, తెలుగువీర లేవరా... దీక్షభూని సాగరా అంటూ స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ భారతావనికే స్పూర్తిధాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన నేలమీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం'' అంటూ తెలుగులో మాట్లాడుతూ ప్రధాని అందరినీ ఆశ్చర్యచకితులను చేసారు. ప్రధాని తెలుగులో ప్రసంగించినంతసేపు ప్రజలు కరతాళధ్వనులు చేసారు.