Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజధానికి స్వాగతమంటూ... విశాఖ బీచ్ లో మోదీ, జగన్ సైకత శిల్పాలు

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు వైసిపి శ్రేణులు సిద్దమయ్యారు. 

First Published Nov 10, 2022, 3:51 PM IST | Last Updated Nov 10, 2022, 3:51 PM IST

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు వైసిపి శ్రేణులు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా వైసిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం ఎదురుగా మోదీ, జగన్ సైకతశిల్పాలను ఏర్పాటుచేసి ఏపీ రాజధానికి విచ్చేస్తున్న గొప్ప నాయకులకు స్వాగతం అంటూ రాసారు. ఈ సైకత శిల్పాన్ని పరిశీలించి అక్కడే మోదీ, జగన్ పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లగురించి వివరించారు ఎమ్మెల్యే గణేష్.