ఓటేయడానికి కదిలిన వృద్దులను... చేతుల్లో మోస్తూ తీసుకెళ్లిన పిడుగురాళ్ల ఎస్సై
గుంటూరు: రాష్ట్రంలో మూడవదశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(బుధవారం) ఉదయంనుండి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
గుంటూరు: రాష్ట్రంలో మూడవదశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(బుధవారం) ఉదయంనుండి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా గురజాల డివిజన్ పరిధిలో వృద్దాప్యం మరియు నడవలేని స్థితిలో ఉన్న కొందరు వృద్దులు సైతం తమ ఓటు హక్కును వినియోగించకునేందుకు సిద్దమయ్యారు. ఆపసోపాలు పడుతూ పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్న తరుణంలో వారికి సాయం అందించారు గుంటూరు రూరల్ పోలీస్.
పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గుత్తి కొండ గ్రామములో తమ ఓటు హక్కును వినియోగించుునేందుకు వచ్చిన వృద్దులను స్వయముగా తన చేతులతో మోస్తూ పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు స్థానిక ఎస్సై షమీర్ బాషా మరియు కానిస్టేబుళ్లు. దీంతో ఓటేయాలన్నా సంకల్పంతో ఇంటినుండి కదిలిని వృద్దులను, వారికి సాయపడ్డ పోలీసులను స్థానికులు అభినందించారు