పెట్రోల్ బదులు వాటర్ ... విజయవాడలో ఓ పెట్రోల్ బంక్ నిర్వాకమిదీ...

విజయవాడ : ఇప్పటికే రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి వెళుతుండటంతో బెంబేలెత్తిపోతున్న వాహనదారులు పెట్రోల్ బంక్ మోసాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

First Published Nov 18, 2022, 11:28 AM IST | Last Updated Nov 18, 2022, 11:28 AM IST

విజయవాడ : ఇప్పటికే రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి వెళుతుండటంతో బెంబేలెత్తిపోతున్న వాహనదారులు పెట్రోల్ బంక్ మోసాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వందలకు వందలు పోసి కొంటున్న పెట్రోల్ తో జేబులకు చిల్లుపడితే అది కాస్తా కల్తీదయితే లక్షలుపోసి కొన్న వాహనాలు సైతం పాడయిపోతాయి. సరిగ్గా ఇదే జరుగుతోందట ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులకు.విజయవాడ అజిత్ సింగ్ నగర్ దాబా కోట్ల సెంటర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో నీళ్లు కలిపిన పెట్రోల్ పోస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకుని వెళ్లగానే దాదాపు 60 నుండి 70 వాహనాలు ఆగిపోయాయని... దీంతో అనుమానం వచ్చి ఓ బాటిల్ లో పెట్రోల్ పట్టుకోగా మొత్తం నీరే వచ్చిందని వాహనదారులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన వాహనదారులు పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లక్షల రూపాయలు పెట్టి కొంటున్న వాహనాలు ఇలాంటివారి కక్కుర్తికి పాడైపోతుంటే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.