Asianet News TeluguAsianet News Telugu

జగ్గయ్యపేటలో బయటపడ్డ పెట్రోల్ బంక్ మోసం... వాహనదారుల ఆందోళన

విజయవాడ : అసలే పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో సతమతం అవుతున్న వాహనదారులకు పెట్రోల్ బంకుల మోసాలు మరింత కలవరపెడుతోంది.

First Published Nov 13, 2022, 11:21 AM IST | Last Updated Nov 13, 2022, 12:41 PM IST

విజయవాడ : అసలే పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో సతమతం అవుతున్న వాహనదారులకు పెట్రోల్ బంకుల మోసాలు మరింత కలవరపెడుతోంది. పెట్రోల్ కల్తీ చేయడం, మీటర్ ట్యాంపరింగ్ చేసి చెల్లించిన ధర కంటే తక్కువగా పెట్రోల్, డీజిల్ వేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నాయి కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు. ఇలా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఓ పెట్రోల్ బంకులో మోసం బయటపడింది. షేర్ మహ్మద్ పేట క్రాస్ రోడ్డులోని బంకులో చెల్లించన డబ్బులకు సరిపడా పెట్రోల్ రావడంలేదంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. చాలాకాలంగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఇలాగే మోసం చేస్తున్నారంటూ వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.