సముద్రంలో మత్స్యకారులు గల్లంతు... బాధిత కుటుంబాలకు పేర్ని కిట్టు పరామర్శ
చేపలవేటకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయిన కృష్ణా జిల్లా మచిలీపట్నం క్యాంబెల్ పేటకు చెందిన మత్స్యకారుల కుటుంబాలను మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు పరామర్శించారు.
చేపలవేటకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయిన కృష్ణా జిల్లా మచిలీపట్నం క్యాంబెల్ పేటకు చెందిన మత్స్యకారుల కుటుంబాలను మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వైసిపి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున గల్లంతయిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే అధికారులతో మట్లాడినట్లు పేర్ని కిట్టు తెలిపారు.