Asianet News TeluguAsianet News Telugu

నూజివీడును ఏలూరు జిల్లాలో కలపొద్దు అంటూ పాదయాత్ర

నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలప వద్దంటూ విజయవాడ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ నూజివీడు సాధన సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైన  పాదయాత్ర.

నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలప వద్దంటూ విజయవాడ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ నూజివీడు సాధన సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైన  పాదయాత్ర.నూజివీడు చారిత్రాత్మక ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని విజయవాడ జిల్లాలో కలపాలని లేదంటే నూజివీడు, మైలవరం, తిరువూరు, గన్నవరం, చింతలపూడి నియోజకవర్గాలతో ఎమ్మార్ అప్పారావు జిల్లా ను ఏర్పాటు చేయాలని నూజివీడు సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు.నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నూజివీడు సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్రను మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, నూజివీడు సాధన సమితి అధ్యక్షులు మరీదు శివరామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకట రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, జనసేన నాయకులు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

Video Top Stories