Asianet News TeluguAsianet News Telugu

డోన్ లో వింత.. ఇంటిముందు కూర్చుని దగ్గిందని.. మహిళపై దాడి..

కర్నూలులోని డోన్ లో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు వివాదాలకు కారణమవుతున్నాయి.

కర్నూలులోని డోన్ లో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు వివాదాలకు కారణమవుతున్నాయి. కొండపేట ప్రాంతంలో ఓ పాజిటివ్ కేసు రావడంతో జనాలు ఇంట్లోనుండి బైటికి రావడానికి వణికిపోతున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ కేసు ఇంటిపక్కనున్న మహిళ బంధువుల ఇంటికి వెడదామని బయల్దేరింది. కొద్దిదూరం నడిచాక, కాసేపు అలుపు తీర్చుకోవడానికి ఓ ఇంటి దగ్గర కూర్చుని దగ్గింది. అంతే స్థానికులు ఆమెతో వాదనకు దిగారు. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. 

Video Top Stories