Asianet News TeluguAsianet News Telugu

జనసేన లీగల్ సెల్ కు అంబేద్కర్ పేరు.. కారణమిదే..: పవన్ కల్యాణ్

గుంటూరు :  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నానీ పాల్కివాలాలు తనకు ఆదర్శమని... వారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు.

First Published Sep 18, 2022, 1:41 PM IST | Last Updated Sep 18, 2022, 1:41 PM IST

గుంటూరు :  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నానీ పాల్కివాలాలు తనకు ఆదర్శమని... వారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. ఓ తరంలో మార్పు కోసం పనిచేయాలన్న స్పూర్తిని రగిల్చింది ఈ మహనీయులేనని అన్నారు. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం అనే అంబేద్కర్ వాఖ్యాలు తనకు బలంగా గుర్తుండిపోయాయన్నారు.  జనసేన లీగల్ విభాగానికి బాబా సాహెబ్ అంబేద్కర్ లీగల్ విభాగం అని పెట్టడానికి కారణం ఆయన పైన ఉన్న అపార గౌరవమేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ లీగల్ సెల్ విభాగం సదస్సును పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన ప్రజలకు అండగా వుండాలని పార్టీ లీగల్ సెల్ విభాగానికి సూచించారు.