తుఫాను తాకిడి ప్రాంతాలకు పవన్ కల్యాణ్
బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గన్నవరం చేరుకున్నారు.
బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గన్నవరం చేరుకున్నారు.గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రు కలియుగ దైవం శ్రీభూసమేత వేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకుంటారు. అనంతరం అకాల వర్షం, తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయానికి భారీగా చేరుకున్నారు.