Asianet News TeluguAsianet News Telugu

జనసైనికుల కేరింతలు, మహిళలు మంగళహారతుల మధ్య... వైజాగ్ కు పవన్ గ్రాండ్ ఎంట్రీ

విశాఖపట్నం : పవన్ కల్యాణ్ రాకతో వైజాగ్ ఎయిర్ పోర్టు జనసైనికులు, మెగా అభిమానులతో నిండిపోయింది.

First Published Aug 10, 2023, 9:04 PM IST | Last Updated Aug 10, 2023, 9:04 PM IST

విశాఖపట్నం : పవన్ కల్యాణ్ రాకతో వైజాగ్ ఎయిర్ పోర్టు జనసైనికులు, మెగా అభిమానులతో నిండిపోయింది. వారాహి యాత్రకోసం హైదరాబాద్ నుండి విశాఖకు చేరుకున్న పవన్ కు విమానాశ్రయంలో మహిళలు మంగళహారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా రోడ్డుమార్గంలోనే నగరంలోని దసపల్లా హోటల్ కు చేరుకున్నారు. 

మూడో విడత వారాహి యాత్రను పవన్ ఉత్తరాంధ్రలో చేపట్టనున్నారు. పదిరోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర వైజాగ్ లో ప్రారంభంకానుంది. సాయంత్రం జగదాంబ సెంటర్లో జరిగే సభలో పవన్ ప్రసగించనున్నారు. అంతకుముందే విశాఖ జిల్లా జనసేన నాయకులతో పవన్ సమావేశమై స్థానిక పరిస్థితులపై చర్చించనున్నారు.