బందరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ఇబ్బందులు... పట్టించుకోరా? :జనసేన నేత బాలాజీ
మచిలీపట్టణం రైల్వే స్టేషన్ లో ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి విశాఖపట్నం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల బాధలు ఏ రైల్వే అధికారికిగాని ప్రజా ప్రతినిధులకు గాని కనిపించకపోవటం శోచనీయమని కృష్ణ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ అన్నారు.
మచిలీపట్టణం రైల్వే స్టేషన్ లో ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి విశాఖపట్నం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల బాధలు ఏ రైల్వే అధికారికిగాని ప్రజా ప్రతినిధులకు గాని కనిపించకపోవటం శోచనీయమని కృష్ణ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ అన్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన మచిలీపట్టణం రైల్వే స్టేషన్ లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది అని బాలాజీ అన్నారు. రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ సదుపాయం లేకపోవటం వల్ల 3వ ప్లాట్ ఫారం కి చేరుకోటానికి మహిళలు , వృధులు , వికలాంగుల బాధ వర్ణాతీతంగా ఉందని అన్నారు... ప్రయాణికుల బ్యాగ్లు తో మెట్లు ఎక్కి దిగేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి అని అన్నారు. తక్షణమే బందరు పార్లమెంట్ సభ్యులు బాల శౌరి స్పందించి మచిలీపట్టణం స్టేషన్ లో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేసి రైల్వే ప్రయాణికుల హక్కులని కాపాడాలని అన్నారు.