Asianet News TeluguAsianet News Telugu

కట్టుబట్టలతో వచ్చా... గుడ్డలూడదీసి పంపించా : యరపతినేని కాసు వార్నింగ్

ధికార వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ప్రతిపక్ష టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లలతో పల్నాడు రాజకీయాలు పాలిటిక్స్ హీటెక్కాయి. 

First Published Apr 20, 2023, 5:11 PM IST | Last Updated Apr 20, 2023, 5:11 PM IST

ధికార వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ప్రతిపక్ష టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లలతో పల్నాడు రాజకీయాలు పాలిటిక్స్ హీటెక్కాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాటలయుద్దంతో గురజాల నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.   ఎమ్మెల్యే కాసు పోలీసులను ఉపయోగించుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, స్టేషన్లకు రమ్మంటూ వేధిస్తున్నారని యరపతినేని ఆరోపించారు. తాను పాత శ్రీనును అయివుంటే ఇప్పటికే టిడిని నాయకులను వేధిస్తున్న వారిని బట్టలూడదీసి నడిరోడ్డుపై కొట్టేవాడినని అన్నారు. తాను మారాను కాబట్టే వాళ్ళు బ్రతుకుతున్నారని హెచ్చరించారు. ఎమ్మెల్యే కాసు లాంటి వారు తన వెంట్రుకతో సమానమని...  నేరుగా పులివెందుల పిల్లి వైఎస్ జగన్ తోనే తేల్చుకుంటానని యరపతినేని అన్నారు.