నరసరావుపేట వద్దు... గురజాలే ముద్దు: పల్నాడు జిల్లా సాధనసమితి డిమాండ్
గుంటూరు: పరిపాలనా సౌలభ్యం కోసం జగన్ సర్కార్ చేపట్టిన కొత్తజిల్లాల ఏర్పాటుపై అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి.
గుంటూరు: పరిపాలనా సౌలభ్యం కోసం జగన్ సర్కార్ చేపట్టిన కొత్తజిల్లాల ఏర్పాటుపై అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఇలా పల్నాడు జిల్లా కేంద్రంగా గురజాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ తో పాటు నాలుగు మండలాల తహసిల్దార్లకు వినతి పత్రాలు అందించారు.
పల్నాడుకు ఎటువంటి సంబంధంలేని నరసరావుపేట హెడ్ క్వార్టర్ చేయడం హాస్యాస్పదమని జేఏసి నాయకులు అన్నారు. పల్నాడు జిల్లాకు గురజాలను హెడ్ క్వార్టర్ గా చేసేంతవరకు కొవ్వొత్తుల ర్యాలీలు, బైక్ ర్యాలీలు, నిరసన దీక్షలు, రైతు దీక్షలు చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.