మహానాడు తర్వాతే జగన్ వేధింపుల్లో సెకండ్ వేవ్...: పల్లా శ్రీనివాస్ ఆందోళన
విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలనే టిడిపి నాయకులపై కక్ష్యసాధింపుకు పాల్పడుతున్నారని...
విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావాలనే టిడిపి నాయకులపై కక్ష్యసాధింపుకు పాల్పడుతున్నారని... మరీ ముఖ్యంగా మహానాడు తర్వాత బిసి నాయకులను టార్గెట్ చేసారని విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని గౌతు శిరీషను ఏపి సిఐడిని ఉపయోగించుకుని కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమెను ఇలా వేధించడం ఏమిటన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆమెను ఏడు గంటలు స్టేషన్లో వుంచి మంచినీళ్లు కూడా ఇవ్వరా..? అంటూ సిఐడి అధికారులపై ఆయన మండిపడ్డారు. బిసి నాయకులను వేధించడంలో సీఎం జగన్ సెకండ్ వేవ్ మొదలు పెట్టారని పల్లా శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసారు.