టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హౌస్ అరెస్ట్
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. నేడు(సోమవారం) టిడిపి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు అండగా అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆసుపత్రుల సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టిడిపి నాయకులను గృహానిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఇంట్లోంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణ లను పోలీసులు గృహానిర్బంధం చేశారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి , ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా గృహనిర్బంధం చేశారు.