Asianet News TeluguAsianet News Telugu

పిలవని పేరంటానికి వచ్చి రాజకీయాలా...: మంగళగిరి వైసిపి నేతకు షాక్

అమరావతి : ఇటీవలే టిడిపిని వీడి వైసిపిలో చేరిన మంగళగిరి నేత గంజి చిరంజీవికి సొంత సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి నుండి అవమానం ఎదురయ్యింది. 

First Published Nov 21, 2022, 11:28 AM IST | Last Updated Nov 21, 2022, 11:28 AM IST

అమరావతి : ఇటీవలే టిడిపిని వీడి వైసిపిలో చేరిన మంగళగిరి నేత గంజి చిరంజీవికి సొంత సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి నుండి అవమానం ఎదురయ్యింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పద్మశాలీలు కార్తీక వనభోజనాల ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైసిపి నేత చిరంజీవి టిడిపి చీఫ్ చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేయగా బిసి నేత ముశ్యం శ్రీనివాస్ అడ్డుకున్నాడు. ఇది రాజకీయ వేదిక కాకున్నా లోకేష్ ను విమర్శిస్తూ చిరంజీవి మాట్లాడటం తగదని శ్రీనివాస్ అన్నారు. నిజంగా రాజకీయాల గురించే మాట్లాడాలంటే ఇక్కడున్న బిసి నాయకులంతా చిరంజీవితో సహా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పుణ్యమేనని అన్నారు. మంగళగిరిలో ఎవ్వరు పోటీచేసినా లోకేష్ గెలుపు ఖాయమని శ్రీనివాస్ అన్నారు. పిలవని పేరంటానికి వచ్చి రాజకీయాలు తగదంటూ చిరంజీవిని హెచ్చరించారు శ్రీనివాస్.