Asianet News Telugu

మంటల్లో కాలి బూడిదైన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (వీడియో)

Jun 6, 2019, 10:42 AM IST

ఆరెంజ్ ట్రావెట్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కర్నూలు జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తుండగా బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు.