విజయవాడలో ఉద్రిక్తత... కార్పోరేషన్ కార్యాలయం ముట్టడికి విపక్షాల విశ్వప్రయత్నం
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 198ను రద్దు చేయాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి విపక్షాల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్న విపక్షాలు ముట్టడికి యత్నించాయి. పోలీసుల వలయాన్ని దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, విపక్ష నేతలకు మధ్య తోపులాట జరగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో విపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.