Asianet News TeluguAsianet News Telugu

నరసరావుపేటలో ఘోరం... తల్లి చేతుల్లోంచి జారి బావిలోపడి ఏడాది చిన్నారి మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. 

First Published Jan 22, 2023, 11:03 AM IST | Last Updated Jan 22, 2023, 11:03 AM IST

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి చేతుల్లోంచి జారి ఇంటిపక్కనే వున్న బావిలో పడి చిన్నారి బాలుడు మృతిచెందాడు. పిట్టగోడపై కూర్చోబెట్టి ఏడాది బిడ్డ భానుప్రకాష్ ను తల్లి ఆడిస్తుండగా ప్రమాదవశాత్తు చేతుల్లోంచి జారి బావిలో పడ్డాడు. దీంతో బాలుడు మృతిచెందగా గాబరాపడ్డ తల్లి కుటుంబసభ్యులు ఎక్కడ తిడతారోనని భయపడి బిడ్డ కనిపించడం లేదని చెప్పింది. వాళ్లు ఇంటిచుట్టుపక్కల వెతకగా బావిలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు గట్టిగా అడగ్గా తన చేతుల్లోంచే జారి బావిలో పడ్డాడని ఆ తల్లి నిజం చెప్పింది. కుటుంబసభ్యులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.