కురపాంలో విషాదం... హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థులను కాటేసిన పాము, ఒకరు మృతి

విజయనగరం జిల్లా కురపాంలో దారుణం చోటుచేసుకుంది.

First Published Mar 4, 2022, 11:33 AM IST | Last Updated Mar 4, 2022, 11:33 AM IST

విజయనగరం జిల్లా కురపాంలో దారుణం చోటుచేసుకుంది. కురపాంలోని జ్యోతిబాపులే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్లో గురువారం రాత్రి నిద్రిస్తున్న విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. రాత్రి సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన నేలపై వరుసగా నిద్రిస్తున్న విద్యార్థులను కాటేసింది. దీంత విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్ధులను కాటేసిన పామును హాస్టల్ సిబ్బంది చంపేశారు. అయితే అప్పటికే చాలామంది విద్యార్థులు పాముకాటుకు గురవగా 8వ తరగతికి చెందిన మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్ పరిస్థితి విషమంగా వుంది. ఈ ముగ్గురునీ మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ వంశీ పరిస్థితి పూర్తిగా విషమించి మృతిచెందాడు.