Krishna Car Accident: పాదచారుల పైనుండి దూసుకెళ్లి ఆటోను ఢీకొన్న కారు... ఒకరు మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దుర్గాపురంలో కారు రక్తపాతం సృష్టించింది. అతివేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కూడా ఢీకొట్టింది. కారు సృష్టించిన ఈ భీభత్సం కారణంగా ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వైపు నుండి గన్నవరం వెళుతుండగా ఈ కారు ప్రమాదం చోటుచేసుకుంది.