శ్రీకాకుళం జిల్లాలో ఘోరం... ఎలుగుబంటి దాడిలో రైతు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టిస్తోంది.

First Published Jun 20, 2022, 5:53 PM IST | Last Updated Jun 20, 2022, 5:53 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టిస్తోంది. వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామానికి చెందిన కోదండరాం అనే రైతు వ్యవసాయ పనులకోసం వెళ్లగా అతడిపై ఎలుగుబంటు దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతిచెందాడు. 

ఈ ఘటన మరిచిపోకముందే మరికొందరు ఎలుగుబంటి దాడికి గురయ్యారు. ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున  పొలం పనుల కోసం వెళ్లిన కొందరిపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడిచేసింది. కొందరు ఈ దాడినుండి తప్పించుకోగా ఓ ఏడుగురు ఎలుగు దాడిలో గాయపడ్డారు. గాయపడినవారంతా ప్రస్తుతం పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కేవలం మనుషులపైనే కాదు మూగజీవాలపైనా ఎలుగు దాడికి పాల్పడుతోంది. ఎలుగుదాడిలో ఇప్పటివరకు 10 ఆవులు తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఎలుగు భయంతో ఇళ్లనుండి బయటకు రావడానికే  కిడిసింగి గ్రామస్తులు భయపడిపోతున్నారు.