video news : కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
కార్తిక సోమవారం, రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ
పెరిగింది. సోమవారం సాయంత్రం శ్రీశైలంలో లక్ష దీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశ విధ హారతులు చేయనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరుస్తారు. 4 గంటల నుంచి దర్శనానికి అనుమతినిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్జిత అభిషేకాలు ఆర్జిత కుంకుమార్చనలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ కేవలం అలంకార దర్శనమేనని శ్రీశైలం ఈవో రామారావు తెలిపారు.
కార్తిక సోమవారం, రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీపెరిగింది. సోమవారం సాయంత్రం శ్రీశైలంలో లక్ష దీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశ విధ హారతులు చేయనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరుస్తారు. 4 గంటల నుంచి దర్శనానికి అనుమతినిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్జిత అభిషేకాలు ఆర్జిత కుంకుమార్చనలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ కేవలం అలంకార దర్శనమేనని శ్రీశైలం ఈవో రామారావు తెలిపారు.