Asianet News TeluguAsianet News Telugu

కొడుకుల నుండి రక్షించండి... లేదండే ఆత్మహత్యకు అనుమతివ్వండి: గుంటూరు ఎస్పీకి వృద్దుడి వినతి

 గుంటూరు : కన్న తండ్రి అన్న ప్రేమ లేదు... కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టాడనే అభిమానం లేదు...

First Published Jan 24, 2023, 4:51 PM IST | Last Updated Jan 24, 2023, 4:51 PM IST

 గుంటూరు : కన్న తండ్రి అన్న ప్రేమ లేదు... కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టాడనే అభిమానం లేదు... చివరకు వృద్దుడనే జాలి కూడా లేదు ఆ కసాయి కొడుకులకు. కన్న బిడ్డలు పెట్టే బాధలు తట్టుకోలేక పోతున్నాను అంటూ 85 ఏళ్ల వృద్దుడు గుంటూరు ఎస్పీని ఆశ్రయించాడు. ఆస్తుల కోసం ముగ్గులు కొడుకులు తనను చంపాలని చూస్తున్నారు... రక్షణ కల్పించాలంటూ మహబూబ్ ఖాన్ అనే వృద్దుడు దయనీయంగా పోలీసులను వేడుకుంటున్న ఘటన గుంటూరులో  వెలుగుచూసింది. మహబూబ్ ఖాన్ కు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు సంతానం. వయసులో వుండగా బంగారం, పొగాకు వ్యాపారం చేసిన అతడు కోట్ల ఆస్తులు సంపాదించాడు. అయితే వృద్దాప్యంలో వున్న అతడిని ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారట. ఎక్కడ సోదరికి తండ్రి ఆస్తి రాసిస్తాడోనని భయపడిపోతూ ముగ్గురు సోదరులు తండ్రితో పాటు సోదరిపైనా దాడులకు దిగుతున్నారట. దీంతో కూతురితో పాటు తనకు రక్షణ కల్పించాలని... లేకపోతే ఆత్మహత్య చేసుకునే అవకాశం కల్పించాలంటూ మహబూబ్ ఖాన్ గుంటూరు ఎస్పీని కోరారు.