Asianet News TeluguAsianet News Telugu

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీశైలంలో ఏర్పాట్లు పూర్తి

శ్రీశైల మహా క్షేత్రంలో  11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది . 

శ్రీశైల మహా క్షేత్రంలో  11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది . రేపు ఉదయం జరిగే  యాగశాల ప్రవేశం తో ఈ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల పురవీధులు రంగురంగుల విద్యుద్దీపాలలు ,పెయింటింగ్ లతో సుందరంగా తీర్చు దిద్దుతున్నారు  . భక్తుల కోసం త్రాగునీరు , వైద్యం,మరుగుదొడ్లు , షామియానాలు, అన్నదానం, సాంస్కృతిక ఏర్పాట్లు చేస్తున్నారు . పార్కింగ్ ,భద్రతా  పరంగా సమస్యలు రాకుండా   2500 మంది  పోలీసులతో గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఆత్మకూరు డిఎస్పి వెంకట్రావు తెలిపారు.కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఉన్నత స్థాయి అధికారులతో ఇప్పటికే పలుసార్లు సమీక్ష నిర్వాహించారు .