ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్తత... వైసిపి ఎమ్మెల్యేను అడ్డుకున్న ఒడిశా అధికారులు
విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ప్రజాప్రతినిధులు, అధికారులను కొటియా గ్రామాలకు వెళ్లకుండా ఒడిశా అధికారులు అడ్డగించారు. అడ్డంగా కంచె వేసి ఆంధ్రా నాయకులు, అధికారులు వెనక్కి వెళ్ళాలంటూ నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు ఒడిశా నాయకులు.కొటియా గ్రామాల్లో జగనన్న విద్యా కానుక , విద్యా దీవెన పథకాలను ప్రారంభించేందుకు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్ సహా అధికారులు ప్రయత్నించారు. అయితే వారిని గ్రామాల్లోకి వెళ్లనివ్వకుండా ఒడిశా అధికారులు అడ్డుకొన్నారు. కొటియా గ్రామాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకొన్నారు. ఒడిశాలోని పొట్టంగి, కొరాపుట్, జయపురం ఎమ్మెల్యేలు, బీజేపీ మాజీ ఎంపీ జయరాం పంగి, బీజేడీ, కాంగ్రెస్ నేతలు సరిహద్దులోని హర్మాడగి చెక్ పోస్టు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.