Asianet News TeluguAsianet News Telugu

పాసులు లేకుంటే ఏపీలోకి నో ఎంట్రీ..

కృష్ణా జిల్లా ఆంధ్రా సరిహద్దు వద్ద హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వస్తున్న వాహనాలను ఈ-పాస్ ఉంటేనే ఏంట్రీ, ఎమర్జెన్సీ తప్ప మిగతా ఏ వాహనాలనూ అనుమతించడం లేదు.

కృష్ణా జిల్లా ఆంధ్రా సరిహద్దు వద్ద హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వస్తున్న వాహనాలను ఈ-పాస్ ఉంటేనే ఏంట్రీ, ఎమర్జెన్సీ తప్ప మిగతా ఏ వాహనాలనూ అనుమతించడం లేదు.అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ కి రావాలనుకునే ప్రయాణీకులు స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలి . కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాలి. కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ లో ఉండాలి. కోవిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి.  పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు, నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు  హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.